![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -815 లో..... కావ్య, అప్పు ఇద్దరు ప్రెగ్నెంట్ కాబట్టి పైకి మెట్లు ఎక్కి వెళ్ళలేరని రాజ్, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ని పైన గదికి పంపించి మనం కిందకి షిఫ్ట్ అవుదామని అన్నతమ్ముళ్లు అనుకుంటారు. ఆ విషయం అందరిని పిలిచి రాజ్, కళ్యాణ్ చెప్తారు. మేమ్ వెళ్ళమని అపర్ణ మొదట చెప్పినా.. ఇక తప్పేలా లేదని సరే అంటుంది.
ఆ తర్వాత రాజ్ అలా కావ్యతో ప్రేమగా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటిరోజు ఉదయం అపర్ణ దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది. అసలు నిద్ర పట్టలేదు. కొత్త రూమ్ కదా అని అపర్ణ అంటుంది. నాక్కూడా అని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు బాగా నిద్ర పట్టిందని ఇందిరాదేవి అనగానే మా బాధ మీకు వెటకారంగా ఉందా అని అపర్ణ సరదాగా అంటుంది. ఆ తర్వాత కావ్య నిద్ర లేచి నన్ను ఏ పని చెయ్యనివ్వను అన్నారు. ఇప్పటివరకు కాఫీ లేదు నేను వెళ్లి పనులు చేసుకుంటానని కావ్య అనగానే వద్దు నేను చేసుకొని తీసుకొని వస్తానని రాజ్ కిచెన్ లోకి వెళ్తాడు. అది అందరు చూస్తారనుకొని ఒక చీర చుట్టుకొని వెళ్తాడు. మరొకవైపు కావ్యకి రెస్ట్ ఇచ్చినప్పటి నుండి ఇంట్లో కాఫీకి దిక్కులేదని అపర్ణ, ధాన్యలక్ష్మి అనుకుంటారు. సుభాష్, ప్రకాష్ లని అపర్ణ, ధాన్యలక్ష్మి కాఫీ పెట్టుకొని తీసుకొని రమ్మంటారు.
ఆ తర్వాత ఇక చేసేదేమీ లేక ప్రకాష్ కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ చీర చుట్టుకొని ఉన్న రాజ్ ని వెనకాల నుండి ప్రకాష్ చూసి.. నా గర్ల్ ఫ్రెండ్ నాకు సర్ ప్రైజ్ ఇస్తానంది.. ఇలా వచ్చిందేమోనని వెనకాలా నుండి హగ్ చేసుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. రాజ్ ముందుకి తిరుగుతాడు. నువ్వారా నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నానని ప్రకాష్ అనగానే ప్రకాష్ తో ధాన్యలక్ష్మి గొడవపడుతుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ కాఫీ తీసుకొని వెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |